తెలంగాణ రహదారులకు కేంద్రం భారీ ఊరట: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: రాజేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో ఎల్బీనగర్ హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో పాటు పలు కీలక జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో ప్రత్యేకంగా భేటీ అయిన ఆయన, కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు పలు ప్రతిపాదనలపై చర్చించారు. ఈ సమావేశంలో రోప్ వేలు, సీఆర్ఐఎఫ్ నిధుల మంజూరుపై సానుకూల నిర్ణయాలు వెలువడ్డాయి.