ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఎండీఎస్ సీట్ల భర్తీకి ప్రకటన
రిపోర్టర్: సురేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలోని 14 దంత వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న 185 ఎండీఎస్ యాజమాన్య సీట్ల భర్తీకి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది. నీట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 24వ తేదీ రాత్రి 10 గంటల్లోగా, అపరాధ రుసుముతో 25వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. బీడీఎస్ ఇంటర్న్‌షిప్ మే 31 నాటికి పూర్తి చేసి ఉండాలని స్పష్టం చేసింది.