జపాన్‌తో టీ20 మ్యాచ్‌కు ముప్పు తెస్తున్న భారీ వర్షాలు

రిపోర్టర్: నరేష్ స్థలం: Sano

జపాన్‌లోని సానో వేదికగా జరగనున్న భారత్, జపాన్ ఏకైక టీ20 మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచివుంది. భారీ వర్షం కారణంగా భారత జట్టు ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. జపాన్ క్రికెట్ చరిత్రలో ప్రపంచ ఛాంపియన్‌ అయిన భారత్‌తో తలపడటం అత్యంత ప్రతిష్టాత్మకమైన సందర్భం కాగా, ప్రతికూల వాతావరణం ఆ దేశ ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఈ టూర్‌కు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తుండగా, జపాన్ కెప్టెన్ కండెల్ కడోవాకి-ప్లెమింగ్ నాయకత్వంలో ఆ జట్టు బరిలోకి దిగనుంది.