కసుమూరు చెరువు కబ్జా.. అడ్డూఅదుపు లేని ఆక్రమణలు!
రిపోర్టర్: సతీష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరు చెరువు కబ్జాకు గురవుతోంది. తటాకం లోతట్టులో సుమారు 80 ఎకరాలకు పైగా ఆక్రమణలపాలైంది. కాలువల ద్వారా సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. యంత్రాలతో హద్దులు ఏర్పాటు చేసి భూములను కబ్జా చేస్తున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఇరిగేషన్ ఏఈ రవికుమార్ రెడ్డి స్పష్టం చేశారు.