రసాయనిక విషాల నుండి దూరంగా ప్రకృతి సేద్యం వైపు అన్నదాత అడుగులు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

రైతులు కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని జన్నారం క్లస్టర్ ఏఈఓ అక్రమ్ సూచించారు. జాతీయ ప్రకృతి వ్యవసాయం మిషన్ లో భాగంగా శుక్రవారం రైతులకు రసాయన రహిత కూరగాయల సాగుపై అవగాహన కల్పించారు. కూరగాయల సాగుతో రైతులకు మేలు జరగడంతో పాటు మంచి ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృషి సఖీలు జక్కుల రజిత అంజలితో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.