అనంతపురంలో విద్యార్థిని గోపికకు ప్రాణం పోసిన ప్రభుత్వ వైద్యులు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ పాఠశాలలో ఉన్మాది చేతిలో తీవ్రంగా గాయపడిన పదోతరగతి విద్యార్థిని గోపికను సర్వజన వైద్యశాల వైద్యులు అద్భుతమైన సేవలతో బతికించారని అధికారులు తెలిపారు. ఆసుపత్రికి తెచ్చేసరికి పల్స్, బీపీ పడిపోయిన బాలికకు అత్యవసర చికిత్స అందించి, ఎనిమిది ప్యాకెట్ల రక్తం ఎక్కించి శస్త్రచికిత్స చేశామని వైద్యులు వెల్లడించారు. ఆరు గంటల పాటు శ్రమించి ప్రాణం నిలపడం పట్ల సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.