ఓటీటీలో రేణూ దేశాయ్ కీలక పాత్రలో తెరకెక్కిన ‘కాశీ మజిలీ’ విడుదల
రిపోర్టర్: సతీష్
స్థలం: తెలంగాణ
నటి రేణూ దేశాయ్ కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు అందించి కీలక పాత్రలో నటించిన ‘కాశీ మజిలీ’ లఘు చిత్రం ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా విడుదలైంది. వారణాసి ఘాట్ల నేపథ్యంలో ప్రేమ, అనుబంధాల భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని దర్శకుడు యమునా కిశోర్ తెరకెక్కించారు. శంకర్ ఇందుచూడన్ ప్రధాన పాత్రలో నటించగా, డాక్టర్ జోస్యభట్ల సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ చిత్రం డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.