హిందూ మనోభావాలు దెబ్బతింటున్నా రేవంత్ రెడ్డి మౌనమేంటని నిలదీత
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
రాష్ట్రంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఘటనలు జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ ద్వేషాన్ని సిద్ధాంతంగా మార్చుకున్నారని మండిపడ్డారు. ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం, అన్నప్రసాదంపై బీఫ్ విసిరేయడం వంటి ఘటనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత పాలకుడికి పడినట్టే నీకూ తగిన శిక్ష తప్పదని హెచ్చరించారు.