ఉద్యోగాల పేరుతో మోసాలు.. నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలి

రిపోర్టర్: కిరణ్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసగిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. డబ్బులిస్తే ఉద్యోగాలంటూ వస్తున్న నకిలీ ప్రకటనలను నమ్మి బాధితులు నిండా మునుగుతున్నారు. పోలీసుల గ్రీవెన్స్‌కు ఇలాంటి ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి. మధ్యవర్తులను ఆశ్రయించకుండా, సంస్థల ప్రామాణికతను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రతిభతోనే ఉద్యోగాలు సాధ్యమవుతాయని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.