లెర్నింగ్ లైసెన్స్తో ఒంటరిగా డ్రైవింగ్ చేస్తున్నారా: భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

లెర్నింగ్ లైసెన్స్ పొందిన వారు ఒంటరిగా వాహనాలు నడపడం చట్టపరంగా నేరమని మోటార్ వాహనాల నిపుణులు స్పష్టం చేశారు. లైసెన్స్ ఉన్న వ్యక్తి పక్కన లేకుండా ఒంటరిగా డ్రైవింగ్ చేస్తే సెక్షన్ 3/181 ప్రకారం ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. వాహనాల ముందు, వెనుక ఎరుపు రంగు ఎల్ బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, లేదంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోల్పోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.