గుండెపోటుతో ఎక్సైజ్ కానిస్టేబుల్ మృతి: విషాదంలో బొబ్బిలి సిబ్బంది

రిపోర్టర్: Alfa News Desk స్థలం: విజయనగరం

బొబ్బిలి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అంపిలి ప్రసాద్ గుండెపోటుతో బుధవారం అకస్మాత్తుగా మృతి చెందారు. ఆయన మరణంతో సహచర ఉద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. CI చిన్నంనాయుడుతో పాటు సిబ్బంది నివాళులర్పించారు. అంత్యక్రియలు బలిజిపేట మండలం వెంగాపురం స్వగ్రామంలో జరగనున్నాయి.