ఫౌజీ షూటింగ్ అప్డేట్: తుది దశకు చేరుకున్న ప్రభాస్ చిత్రం

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

ప్రస్తుతం కల్ కి రెండు అలాగే ఫౌజీ చిత్రాల షూటింగ్ లతో బిజీగా ఉన్నట్లు అగ్ర హీరో ప్రభాస్ గురించి సినీ వర్గాలు వెల్లడించాయి. స్వాతంత్ర్య సమరభూమి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఆయన సైనికుడి పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఈ నెల మూడవ తేదీ నుంచి తిరిగి ఈ సినిమా సెట్ లో ప్రభాస్ జాయిన్ కానున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.