'అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు': అమృత్సర్‌లో 27 కిలోల హెరాయిన్ సీజ్

రిపోర్టర్: రాజేష్ స్థలం: పంజాబ్

పంజాబ్‌లోని అమృత్సర్‌లో కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అంతర్జాతీయ డ్రగ్స్ మరియు ఆయుధాల స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు చేశారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 27 కిలోల హెరాయిన్‌తో పాటు ఒక అత్యాధునిక విదేశీ పిస్టల్, మూడు తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు ఈ ముఠా సరిహద్దులు దాటించి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.