నాగర్ కర్నూల్ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు
రిపోర్టర్: సురేష్
స్థలం: నాగర్ కర్నూల్
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన సందర్భంగా జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ నాగర్ కర్నూల్ వెల్లడించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో బుధవారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.