ఈస్పోర్ట్స్ అర్హత వివాదంపై ఈఎస్ఎఫ్ఐ తీవ్ర ఆవేదన వ్యక్తీకరణ

రిపోర్టర్: సురేష్ స్థలం: న్యూఢిల్లీ

జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలలో ఈస్పోర్ట్స్ విభాగంలో భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. మంగోలియాతో జరగాల్సిన ఈఫుట్బాల్ మ్యాచ్ రద్దు కావడం, గోల్ డిఫరెన్స్ లెక్కింపులో జరిగిన అన్యాయంపై ఈస్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. సాంకేతిక లోపాలు, నిర్వాహకుల వైఫల్యం వల్లే తమకు అర్హత కోల్పోయే పరిస్థితి వచ్చిందని, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా స్పందించాలని కోరింది.