తెలంగాణ హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నేశ్వరరావు మర్యాదపూర్వక భేటీ

రిపోర్టర్: సురేష్ స్థలం: సూర్యాపేట

తెలంగాణ హైకోర్టు స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నేశ్వరరావు మంగళవారం నాడు రాష్ట్ర మంత్రి, హుజూర్ నగర్ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పలు కీలక అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి, హుజూర్ నగర్ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను చిత్రాలతో సహా పంచుకున్నారు.