అమెరికాలో నల్గొండ విద్యార్థిని గల్లంతు: ఆందోళన వ్యక్తం చేస్తూ విదేశాంగ శాఖకు కోమటిరెడ్డి విజ్ఞప్తి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Nalgonda

అమెరికాలోని మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థిని శ్రీజారెడ్డి కోయ అదృశ్యం కావడాన్ని తీవ్రంగా ఆందోళనకరమని పేర్కొంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు యూఎస్ లోని భారత రాయబార కార్యాలయం మరియు బోస్టన్ పోలీసు అధికారులను కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమన్వయం చేసుకోవాలని సోమవారం విజ్ఞప్తి చేశారు.