అమరావతి ముంపుపై దుష్ప్రచారం: నెదర్లాండ్స్ నిపుణులతో డిజైన్ చేశామని మంత్రి నారాయణ ఫైర్

రిపోర్టర్: రాజేష్ స్థలం: Ponnur

రాజధాని అమరావతి వర్షానికి మునిగిపోతుందంటూ కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నెదర్లాండ్స్ ఇంజనీర్ల సహకారంతో 200 ఏళ్ల వర్షపాతాన్ని అధ్యయనం చేసి పటిష్టమైన డిజైన్లు రూపొందించామని స్పష్టం చేశారు. నిర్మాణాలు పూర్తయితే నగరంలో ఎక్కడా చుక్క నీరు నిలవదని, ముంపు ముప్పు ఉండదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.