బాలీవుడ్ సెన్సేషన్: బ్రహ్మాస్త్ర సీక్వెల్లో చాన్స్ కొట్టేసిన యువ నాయిక అనీత్

రిపోర్టర్: విజయ్ స్థలం: ముంబై

బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర చిత్రానికి సీక్వెల్లో కీలక పాత్ర కోసం యువ నాయిక అనీత్ పడ్డాను మేకర్స్ సంప్రదించినట్లు సినీ వర్గాల ద్వారా సమాచారం వెల్లడైంది. గత ఏడాది సయారా సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ భామకు ఈ ప్రాజెక్ట్ ద్వారా భారీ అవకాశం దక్కిందని టాలీవుడ్, బాలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఆమె రణ్బీర్ కపూర్కు జోడీగా నటిస్తుందా లేదా ఇతర పాత్రలో కనిపిస్తుందా అనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది.