లఖింపూర్ ఖేరీలో పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలిని కాల్చి చంపిన దుండగుడు
రిపోర్టర్: గోపి
స్థలం: లఖింపూర్ ఖేరీ
ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో దారుణం చోటుచేసుకుంది. చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాలలో నిషాత్ ఫాతిమా అనే 26 ఏళ్ల మహిళా ఉపాధ్యాయురాలిని సౌద్ అన్సారీ అనే 28 ఏళ్ల యువకుడు కాల్చి చంపాడు. పెళ్లి చేసుకోవాలని వేధించిన నిందితుడు, ఆమెపై కాల్పులు జరిపిన అనంతరం తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో పాఠశాలలో పరీక్షలు రాస్తున్న దాదాపు 350 మంది విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.