పులివెందులలో కూటమి భారీ విజయం: వైకాపాకు కోలుకోలేని షాక్
రిపోర్టర్: హరి
స్థలం: వైఎస్ఆర్ కడప
వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల్ లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారని ఎన్నికల అధికారులు వెల్లడించారు. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత గడ్డపై తెదేపా అభ్యర్థి గీతాకుమారి పద్నాలుగు వేల ఓట్ల భారీ మెజార్టీతో ఛైర్పర్సన్గా గెలుపొందారు. పులివెందులలో ముప్ పై ఏడు స్థానాలను కూటమి కైవసం చేసుకోగా, వైకాపా కేవలం మూడు స్థానాలకే పరిమితమై దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.