జగిత్యాల ప్రజావాణిలో సత్తక్కపల్లి గ్రామస్థుల ఆవేదన: రెవెన్యూ హోదా కల్పించాలని విజ్ఞప్తి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: జగిత్యాల

మెట్పల్లి మండలం సత్తక్కపల్లిని స్వతంత్ర రెవెన్యూ గ్రామంగా గుర్తించాలని కోరుతూ గ్రామస్థులు సోమవారం జగిత్యాల కలెక్టరేట్ లోని ప్రజావాణికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి అధికారులకు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. తమ గ్రామానికి స్వతంత్ర పరిపాలన ఉన్నప్పటికీ రికార్డుల్ లో బండలింగాపూర్ గా నమోదైందని, దీనివల్ల ఆధార్, పాస్ పుస్తకాలలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.