సేవా సంకల్ప్ అభియాన్: సరూర్నగర్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో డా. లక్ష్మణ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: సరూర్ నగర్

రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ ప్రాంతంలో సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా బీజేపీ సీనియర్ నేత డాక్టర్ కె. లక్ష్మణ్ పర్యటించారు. సరూర్నగర్ చెరువు వద్ద నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించి, భవానీ శంకర ఆలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు.