కనకదుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో లడ్డూ ప్రసాదం వెండింగ్ మెషీన్లు!
రిపోర్టర్: అశోక్
స్థలం: విజయవాడ
విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక లడ్డూ ప్రసాదం యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు వీటిని ఖరారు చేశారు. టచ్ స్క్రీన్ ద్వారా యూపీఐ పేమెంట్ చేసి సులభంగా లడ్డూ బాక్సులు పొందేలా రైల్వేస్టేషన్, బస్టాండ్, ఆలయ క్యూలైన్ల వద్ద ఈ వెండింగ్ మెషీన్లు అందుబాటులో ఉంచనున్నారు.