లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో భారత సంతతి మహిళ నిత్యా రామన్ దూకుడు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: లాస్ ఏంజిల్స్

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో కేరళలో జన్మించిన భారత సంతతి నేత నిత్యా రామన్ విజయం దిశగా దూసుకుపోతున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుత సమాచారం ప్రకారం ఆమెకు యాభై ఒక శాతం పైగా ఓట్లు పోలయ్యాయి. ప్రత్యర్థిపై బలమైన ఆధిక్యంలో నిలిచిన ఆమె, లాస్ ఏంజిల్స్ నగరానికి తొలి ఏషియన్ అమెరికన్ మేయర్గా రికార్డు సృష్టించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు వెల్లడించారు.