డ్రైనేజీ వ్యవస్థ లేక చెరువులా మారిన జన్నారం ప్రధాన రహదారి
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో భారీ వర్షాలతో ప్రధాన రహదారి జలమయమైంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రోడ్డుపై వరద నీరు నిలిచిపోయి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు నిల్వ ఉండటంతో రోడ్డు చెరువును తలపిస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని, రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఆవేదనతో కోరుతున్నారు.