సీఈవో సీఎం కంటే నీటిని అందించిన నేతగా గుర్తింపు ముఖ్యం: చంద్రబాబు

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

సీఈవో సీఎం కంటే ప్రజలకు నీటిని అందించిన నేతగా గుర్తుండాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం ఎడమ కాల్వ, వెలిగొండ ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల జీవితాల్లో కొత్త మార్పులు తీసుకొస్తాయని పేర్కొన్నారు. ఇవి దశాబ్దాల కలల సాకారమని, తాగునీటి భద్రతకు చిరస్థాయిగా నిలుస్తాయని ఆయన తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.