తిరుమలకు చేరుకున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల గరుడ సేవ గొడుగులు
రిపోర్టర్: రాము
స్థలం: తిరుమల
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడసేవ కోసం చెన్నై నుండి భక్తులు సమర్పించిన పవిత్ర గొడుగులు తిరుమలకు చేరుకున్నాయి. హిందూ ధర్మార్థ సమితి తరఫున తొమ్మిది, విశ్వహిందూ పరిషత్ తరఫున పదకొండు గొడుగులను సమర్పించగా రేపు సాయంత్రం జరిగే గరుడవాహన సేవకు వీటిని అలంకరించనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ చ వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడుతో పాటు పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు.