హైదరాబాద్లో దొంగల బీభత్సం: పండగ వేళ ఇళ్ల భద్రతపై పోలీసుల తీవ్ర హెచ్చరిక
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
దసరా దీపావళి పండగ సెలవుల్లో సొంతూళ్లకు వెళ్లే హైదరాబాద్ ప్రజలు ఇళ్ల భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు తీవ్రంగా అప్రమత్తం చేశారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ విలువైన వస్తువులు దోచుకెళ్తున్న ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ప్రయాణానికి ముందే విలువైన ఆభరణాలను బ్యాంక్ లాకర్లలో భద్రపరుచుకోవాలని, సీసీటీవీలు అమర్చుకోవడంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్లో లాక్డ్ హౌస్ మోనిటరింగ్ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.