తుఫాన్ హెచ్చరికల వేళ కాకినాడ జిల్లాలో సినిమా థియేటర్లు బంద్
రిపోర్టర్: రాజేష్
స్థలం: కాకినాడ
అర్నబ్ తుఫాన్ తీవ్రత కారణంగా కాకినాడ జిల్లాలో సినిమా షోలను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 27 మధ్యాహ్నం నుంచి షోలు బంద్ చేస్తున్నామని, 28న పూర్తిగా థియేటర్లు మూసివేస్తామని తెలిపారు. పరిస్థితిని బట్టి అక్టోబర్ 29న మళ్లీ థియేటర్లు తెరిచే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఆకస్మిక బంద్ కారణంగా ఈ నెల 30న విడుదల కావాల్సిన సినిమాల ప్రదర్శనపై తీవ్ర సందిగ్ధత నెలకొంది.