శ్రీకాకుళంలో బహుదా నది వరద పరిస్థితులను పరిశీలించిన కలెక్టర్ ఎస్పీ
రిపోర్టర్: గోపి
స్థలం: శ్రీకాకుళం
అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో నెలకొన్న బహుదా నది వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు శ్రీకాకుళం జిల్లా పోలీసులు వెల్లడించారు. అక్టోబర్ 29వ తేదీన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మరియు ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి సంయుక్తంగా ఈ ప్రాంతాన్ని సందర్శించి వరద ఉధృతిని సమీక్షించారని తెలిపారు. శ్రీకాకుళంతో పాటు ఎగువ ప్రాంతమైన ఒడిశాలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారుల పర్యవేక్షణ కొనసాగుతోందని పేర్కొన్నారు.