లోకేష్ రాజీనామా డిమాండ్ చేస్తూ విజయవాడలో వైఎస్సార్‌సీపీ నిరసన
రిపోర్టర్: విజయ్
స్థలం: విజయవాడ
విజయవాడ శాప్ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ నేడు నిరసనకు పిలుపునిచ్చింది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని, మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. ఈ ఆందోళనలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులకు నోటీసులు జారీ చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా శాప్ కార్యాలయానికి తీరి తీరుతామని వైఎస్సార్‌సీపీ స్పష్టం చేసింది.