రామాయణ పాటలపై విమర్శల వివాదంపై స్పందించిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
నితేశ్ తివారీ దర్శకత్వంలో వస్తున్న భారీ ప్రాజెక్ట్ రామాయణ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఏఆర్ రెహమాన్ తాజాగా విమర్శలపై స్పందించారు. మొదట్లో పాటలను తప్పుబట్టిన వారే ఆ తర్వాత తమ అభిప్రాయాన్ని మార్చుకుని క్షమాపణలు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. ట్రోల్స్ మరియు విమర్శలను తాను పెద్దగా పట్టించుకోనని, కేవలం తన పనిని వంద శాతం నిజాయతీగా చేయడంపైనే పూర్తి దృష్టి పెడతానని రెహమాన్ స్పష్టం చేశారు.