సంగమేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి పూజలు: భక్తుల విశేష పంచామృత అభిషేకాలు

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండల పరిధిలోని బద్దేవోలు క్రాస్ రోడ్డు వద్ద కొలువైన ప్రసిద్ధ శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రధాన అర్చకులు సాయి కుమార్ శర్మ స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో విశేష అభిషేకాలు, కుంకుమార్చనలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగితాలపూరు గ్రామానికి చెందిన గుమ్మా దిలీప్, సురేఖ దంపతులు కుటుంబ సమేతంగా పూజల్లో పాల్గొన్నారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.