ముంబై విమానాశ్రయంలో ఆరు గంటల పాటు పూర్తిగా నిలిచిపోనున్న రాకపోకలు
రిపోర్టర్: సునీల్
స్థలం: ముంబై
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం వార్షిక నిర్వహణ పనుల నిమిత్తం నవంబర్ 19వ తేదీన ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మూసివేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వర్షాకాలం ముగిసిన తర్వాత చేపట్టే ఈ నిర్వహణ పనుల వల్ల విమానాశ్రయానికి చెందిన రెండు ప్రధాన రన్వేలు తాత్కాలికంగా మూసివేయబడతాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణ షెడ్యూల్స్ సర్దుబాటు చేసుకోవాలని ఎయిర్పోర్టు వర్గాలు సూచించాయి.