జోధ్పూర్ వేదికగా సెప్టెంబర్ 26 నుంచి తరంగ్ శక్తి విన్యాసాలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: జోధ్పూర్
రాజస్థాన్ లోని జోధ్పూర్ వైమానిక స్థావరంలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 11 వరకు ప్రతిష్టాత్మక బహుళ దేశాల వైమానిక విన్యాసాలు తరంగ్ శక్తి జరగనున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ సహా సుమారు 40 దేశాలు ఈ విన్యాసాలలో పాల్గొంటున్నట్లు వైమానిక దళ ఉప అధిపతి ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ అనుభవాల ఆధారంగా ఈ విన్యాసాలను అత్యంత వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.