ఆసియా క్రీడల సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన భారత మహిళల క్రికెట్ జట్టు
రిపోర్టర్: శివ
స్థలం: ఇండియా
ఆసియా క్రీడల క్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి భారత మహిళల క్రికెట్ జట్టు సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జపాన్‌ను భారత బౌలర్ శ్రీ చరణి నాలుగు వికెట్లతో కట్టడి చేయగా, జపాన్ కేవలం 57 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనలో షఫాలీ వర్మ కేవలం 15 బంతుల్లోనే 40 పరుగులు చేసి విజయాన్ని లాంఛనం చేసింది.