ఢిల్లీలో మహిళా జర్నలిస్టులపై పోలీసుల దాడి, తీవ్ర ఉద్రిక్తత

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఢిల్లీ

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను ప్రశ్నించబోయిన ఇద్దరు మహిళా జర్నలిస్టులను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి దారుణంగా కొట్టారని ఆరోపణలు వచ్చాయి. కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు పూర్తిగా ఖండించారు. వీరు వీఐపీ భద్రతకు ఆటంకం కలిగించారని, గర్భిణీ పోలీసు అధికారిపై దాడి చేశారని పోలీసులు ఎదురుదాడికి దిగారు. ఈ ఘటనపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి.