హైవేపై భారీ వృక్షం కూలిపోవడంతో ప్రకాశం జిల్లాలో పూర్తిగా స్తంభించిన రాకపోకలు

రిపోర్టర్: నరేష్ స్థలం: ప్రకాశం

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మురసు తుపాను తీవ్ర ప్రభావం చూపుతోందని, సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ సమీపంలోని పెద్ద చెరువు మలుపు వద్ద ఒంగోలు-కర్నూలు రహదారిపై భారీ వృక్షం కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చెట్టును తొలగిస్తూ ట్రాఫిక్ను పునరుద్ధరించేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు.