'కేసీఆర్ కుటుంబం పేరుట 439 ఎకరాలు ఉన్నాయి': అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ శాసనసభ వేదికగా కేసీఆర్ కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధరణి పోర్టల్ అక్రమాలకు, భూ దందాలకు కేంద్రబిందువుగా మారిందని ఆరోపించారు. ఉద్యమకారుడినని చెప్పుకునే కేసీఆర్ కుటుంబ సభ్యుల పేరిట మొత్తం 439 ఎకరాల భూమి ఉందని, కేసీఆర్ దంపతుల పేరిట 65 ఎకరాలు, కేటీఆర్ పేరిట 49 ఎకరాలు, హిమాన్షు పేరిట 46.3 ఎకరాలు, కవిత, హరీష్ రావు, సంతోష్ కుమార్ కుటుంబాలకు భారీగా భూములు ఉన్నాయని రేవంత్ రెడ్డి సభలో లెక్కలతో సహా బహిర్గతం చేశారు.