నవంబర్ 1 నుంచి ఆర్థిక నిబంధనల్లో మార్పులు: సామాన్యులపై ప్రభావం

రిపోర్టర్: నరేష్ స్థలం: తెలంగాణ

నవంబర్ మొదటి తేదీ నుంచి దేశంలో జీఎస్టీ నిబంధనల్లో కీలక మార్పులు అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం మరియు ఆర్థిక నిపుణులు వెల్లడించారు. దీనితో పాటు ప్రభుత్వ పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ ప్రక్రియ ప్రారంభం కానుండగా, ఆడిట్ వర్తించే పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్ దాఖలు గడువును నవంబర్ 21 వరకు పొడిగించారు. ఎల్పీజీ సిలిండర్ల ధరల సమీక్ష కూడా ఉండటంతో సామాన్యులు ఆర్థిక ప్రణాళికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు.