వైభవంగా కె.జగన్నాధపురం వినాయక నిమజ్జన వేడుకలు

రిపోర్టర్: Y.V.RAMANA స్థలం: ఐనవిల్లి

అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం కడలి వారి పాలెంలో వినాయక నవరాత్రి మహోత్సవాలు గురువారంతో ఘనంగా ముగిశాయి. స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తిశ్రద్ధలతో వినాయకుడిని కాలువలో నిమజ్జనం చేశారు.