పసుపు కొమ్ములతో అద్భుతమైన భారీ వినాయక విగ్రహం ఏర్పాటు

రిపోర్టర్: గోపి స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా రాజాం మండలం బద్దం గ్రామంలో పర్యావరణహితంగా 150 కిలోల పసుపు కొమ్ములతో 15 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని తీర్చిదిద్దారు. చాలెంజ్ యూత్ ఆధ్వర్యంలో 21 రోజుల శ్రమతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రసాయన రంగులకు దూరంగా పూర్తిగా ప్రకృతి సిద్ధంగా దీన్ని రూపుదిద్దారు. పూజల అనంతరం ఈ పసుపు కొమ్ములను భక్తులకు పవిత్ర ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు.