అన్నదాతలకు తీపి కబురు: తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని డీఎస్వో భరోసా
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తంగళ్లపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని అంకుసాపూర్ గ్రామంలో అకాల వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యం రాశులను జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ పరిశీలించారు. ఈ సందర్భంగా తడిసిన ధాన్యం పట్ల రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వ మద్దతు ధరకే ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని ఆమె భరోసా కల్పించారు. త్వరలోనే గ్రామంలో కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తామని, తేమ శాతం పరిమితిలో ఉండేలా చూసుకోవాలని రైతులకు ఆమె సూచించారు.