సాలూరులో విషాదం: వ్యాన్ ఢీకొని బాలుడు మృతి చెందడంతో తీవ్ర కలకలం

రిపోర్టర్: రాజేష్ స్థలం: సాలూరు

దసరా సెలవులు ముగించుకుని తిరిగి వస్తున్న తొమ్మిదేళ్ల బాలుడు రాహుల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సాలూరు పట్టణంలోని మహంతి వీధి సమీపంలో ఎదురుగా వచ్చిన వ్యాన్ వారి బైక్ను ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనలో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, బైక్పై ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, టౌన్ ఎస్సై అనీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారని పోలీసులు వెల్లడించారు.