తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ
రిపోర్టర్: రాజేష్
స్థలం: Hyderabad
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో రాగల మూడు గంటల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఖమ్మం, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ జిల్లాలలో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ఐఎండీ అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలలో పంటలను నిల్వ ఉంచవద్దని, ఉరుములు, మెరుపుల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.