విజయనగరం మున్సిపల్ ఎన్నికలు: ప్రశాంతంగా ముగిసిన పోలింగ్, 65 శాతానికి పైగా ఓటింగ్ నమోదు

రిపోర్టర్: శివ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో పురపాలక ఎన్నికల ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా ముగిసిందని జిల్లా అధికారులు తెలిపారు. ఉదయం నుంచి మందకొడిగా ప్రారంభమైన ఓటింగ్ క్రమంగా పుంజుకుని సాయంత్రానికి ఊపందుకుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం అరవై ఐదు శాతానికి పైగా ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. నెల్లిమర్ల నగర పంచాయతీలో అత్యధికంగా ఎనభై శాతానికి పైగా ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను పటిష్ట బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూములకు తరలించారు.