ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: పలు మెట్రో స్టేషన్ల మూసివేత పొడిగింపు
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఢిల్లీ
ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తీరును నిరసిస్తూ విపక్షాలు, విభిన్న పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా సోమవారం పలు మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల మూసివేతను సాయంత్రం వరకు పొడిగించినట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే అన్ని స్టేషన్లలోనూ ప్రయాణికులకు ఇంటర్ ఛేంజ్ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని ఢిల్లీ మెట్రో వర్గాలు వెల్లడించాయి.