ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమన్న ఎమ్మెల్యే గౌతు శిరీష
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
పలాస పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి పెన్షన్లు, హౌసింగ్ తదితర అంశాలపై మొత్తం 30 వినతులను ఆమె స్వీకరించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆమె ఆదేశించారు.