బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తిరుపతి
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల విజయవంతానికి డిప్యూటేషన్ అధికారులు, సిబ్బంది భక్తిశ్రద్ధలతో, నిబద్ధతతో పనిచేయాలని తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. ఆస్థాన మండపంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈసారి రెండు బ్రహ్మోత్సవాలు వస్తుండటంతో భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు పూర్తి సమన్వయంతో సేవలందించాలని ఆదేశించారు.